పత్తికొండ: వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్యాస్ లీక్ అయ్యి దగ్ధం పూర్తి వివరాలు
వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామంలో గురువారం వంటగ్యాస్ లీక్‌తో జి. రామాంజనేయులు ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు, బైక్, ఫ్రిజ్, టీవీ, వంట సామగ్రి, 10 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 97 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.