బంగారు పాల్యం పోలీస్ స్టేషన్లో 12 ద్విచక్ర వాహనాల వేలం ద్వారా ప్రభుత్వానికి 1,51,000రూ ఆదాయం
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
బంగారు పాళ్యం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో బుదవారం ఉదయం నుండి నిర్వహించిన వివిధ కేసుల్లో పట్టుబడిన 13 ద్విచక్ర వాహనాలను మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలను వేలం వేయడం జరిగింది. ఇందులో ఒక ద్విచక్ర వాహనం నిలిచిపోగా 12 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా జీఎస్టీ తో కలిపి 1,51,000 రూపాయలు ప్రభుత్వనికి అదయం వచ్చిందన్నారు. ట్రెజరీ ఆఫీసులో జమ చేయడం జరుగుతుందని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.