పత్తికొండ: పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు లబ్ధిదారులతో గృహప్రవేశం
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ బుధవారం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదల గృహ కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భరత్ నాయక్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల ప్రవేశాలు జరుగుతున్నాయి.