అమ్మణ్ణి దసరా అలంకారాలు దర్శించుకోండి
- భక్తులకు ఆహ్వానం పలికిన EO ప్రసన్న లక్ష్మి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో సోమవారం నుండి మొదలు అవుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో దర్శనం ఇవ్వబోతుందని ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్న లక్ష్మి తెలియజేసారు. శుక్రవారం ఆలయ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశం లో ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో ప్రతి రోజు ఒక్కొక్క చోట నుండి అమ్మణ్ణికి సారె తీసుకురావడం జరుగుతుందని భక్తులు ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మణ్ణి ని దర్శించి తీర్థప్రసాదాలు సేవించాలని ప్రసన్న లక్ష్మి కోరారు.