గోకవరం: ప్రధానమంత్రి ఆదర్శ యోజన పనులను మార్చి 31 లోగా పూర్తి చేయాలి. కలెక్టర్ ప్రశాంతి
ప్రధానమంత్రి ఆదర్శ యోజన కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31వ తేదీలోగా ప్రతిపాదనను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీఎం ఆదర్శ యోజన కార్యక్రమం పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐదు కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదించిన 100 పనులను మార్చి చివరి లోగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు.