మేడ్చల్: జవహర్ నగర్ లో పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్
మేడ్చల్ జిల్లా జవహర్ నగరంలోని పద్మశాలి టౌన్షిప్ లోని ఓ గుడిసెలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 11 మందిని జవహర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 53000 నగదు, 9 సెల్ ఫోన్లు, నాలుగు సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.