వట్పల్లి: మేడికుంద తండాలో తాగునీటి ఇబ్బందులు.
సంగారెడ్డి జిల్లా వట్టపల్లి మండలం మేడికుంద తండాలో మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తులు ఇబ్బందుల గురవుతున్నామని తెలిపారు. గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలిపారు. అధికారులకు మొరపెట్టుకున్న స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన ఖాళీ బిందెలతో నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల విష జ్వరాలు వ్యాపించి అనారోగ్యల బారిన పడుతున్నట్లు తెలిపారు.