ముధోల్: బోరిగాం గ్రామంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించాలని దళిత సంఘాల ధర్నా
Mudhole, Nirmal | May 30, 2025 నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో బౌద్ధ పూర్ణిమ మే 12న ప్రభుత్వ స్థలంలో నుంచి తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చలో బోరిగాంకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేశారు. వెంటనే కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు