అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని గంగలకుంట గ్రామానికి చెందిన భాష అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.