కడప: డిసెంబర్ 10న రాష్ట్రవ్యాప్త ఆందోళన: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
Kadapa, YSR | Dec 2, 2025 కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలను నిలదీస్తూ డిసెంబర్ 10న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఐ పిలుపునిచ్చింది. ధాన్యం కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం, గోనె సంచుల కొరత, తేమ సాకుతో కొర్రీలు పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం మండిపడ్డారు. కౌలు రైతులకు సుఖీభవ సాయం, రబీ నుంచి ఉచిత బీమా, తుఫాను నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.