అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని దేవస్థానం ఈవో లక్ష్మి కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు అయన వెల్లడించారు. గోదావరి వరద కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం మునిగిపోయినట్లు చెప్పారు. ఈ కారణంగా భక్తులకు దర్శనాలు నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరద నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, మరికొద్ది రోజులు ఇదేవిధంగా తగ్గితే అమ్మవారి ఆలయం వరద నీటి నుంచి బయటపడుతుందని తెలిపారు.