మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు స్థానిక జాఫర్ నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోనీ ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కారణజన్ముడని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.