రాజుపాలెంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ నోటీసులు జారీ
రాజుపాలెం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో చాలామంది అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ క్రమంలో స్థానిక పంచాయతీ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారు ఆ స్థలం నుంచి నిర్మాణాలను తొలగించాలంటూ నోటీసులు ఆ షాపులకూ శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అంటించారు. నోటీసులకు సమాధానం చెప్పకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.