రాయచోటి: జగన్‌కి ట్వీట్ ధైర్యం మాత్రమే… అసెంబ్లీ ధైర్యం లేదా?: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం కాకుండా, గెలిచిన 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చే జనవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై చర్చించే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఒక ఎమ్మెల్యేగా కూడా చూడడం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నెలలో ఒక్కరోజు మాత్రమే మీడియా ముందుకు రావడం, ట్విట్టర్ పోస్టులు చేయడం, జైలు పర్యటన పేరుతో రైతుల వద్ద దండయాత్ర