సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తన పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి:ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి
సూర్యాపేట జిల్లా: తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తన పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి శుక్రవారం తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అనుబంధంగా సంక్షేమ హాస్టల్స్ సదుపాయాలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.