కుప్పం: జడి వానతో జనజీవనం అస్తవ్యస్తం
కుప్పం ప్రాంతంలో రెండు రోజులుగా జడి వానతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ధోరణితో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా కుప్పం ప్రాంతంలో మాత్రం బుధవారం చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండగా చలి తీవ్రత ఎక్కువైంది.