అడ్డాకుల: విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు
విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కమిటీ సమావేశంలో శుక్రవారం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8250 కోట్ల స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, విద్యాసంస్థలు బాగుపడాలంటే 30 శాతం నిధులు కేటాయించాల్సిందేనని అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యాలయం, అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు.