పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కళ్యాణ దుర్గం కు శుక్రవారం రాత్రి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, ఎంపీలు లక్ష్మీనారాయణ, పార్థసారథి, ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, ఎమ్మెస్ రాజు, కాలువ శ్రీనివాసులు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పోలీస్ అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చారు.