గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టి అనే కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , డిఆర్ఓ మోహన్ కుమార్ మేయర్ ఆముద చూడ చైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరభావంతో మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను సోదర భావంతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు