భువనగిరి: యాదగిరిగుట్టలో వైభవంగా నిత్య కళ్యాణ మహోత్సవం పాల్గొన్న భక్తులు అర్చకులు
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్య పూజ్యులు యధావిధిగా జరిగాయి ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి అమ్మవార్లకు సుప్రభాత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంభులకు నిజాభిషేకం తులసి దళాలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సుదర్శన నరసింహ హోమం నిత్య కళ్యాణోత్సవంలో భక్తుల జంటలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.