బాపట్ల: రౌడీ షీటర్లు అల్లళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం: బాపట్ల రూరల్ ఎస్సై శ్రీనివాస్
రౌడీ షీటర్లు అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని బాపట్ల రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి కుటుంబంతో హాయిగా గడపాలని సూచించారు. ఎవరైనా గొడవలు ప్రోత్సహిస్తే చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ ప్రయోగించి సెంట్రల్ జైలుకు పంపుతామన్నారు.