మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న బుల్లితెర గాయకుడు దర్శన్ నారాయణ
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు సరిగమప 20 సీజన్ విజేత, బుల్లితెర గాయకుడు దర్శన్ నారాయణ ఆదివారం కుటుంబ సమేతంగా వచ్చారు. వారికి శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. వారు గ్రామదేవత మంచాలమ్మ దేవికి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం గురు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బంగారు పల్లకి సేవలో పాల్గొన్నారు.