రాయదుర్గం: మురడి గ్రామంలో భార్యను చంపేసిన భర్త
కడవరకూ తోడుంటానని వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్తే భార్యను అతి దారుణంగా నరికి చంపిన సంఘటన డి.హిరేహాల్ మండలం మురడి గ్రామంలో చోటు చేసుకుంది. టి.వీరాపురం గ్రామానికి చెందిన నాగరత్నమ్మ కు 13 ఏళ్ల క్రితం మురడి గ్రామానికి చెందిన హనుమంతరాయుడితో వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి మద్య ఏం జరిగిందో గానీ సోమవారం తెల్లవారుజామున హనుమంతరాయుడు ఆతి కిరాతకంగా నరికి చంపాడు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.