చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి ఎటువంటి రాజీలేకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ, నాగార్జున నగర్, మీనాక్షి నగర్ ప్రాంతాల్లో 1.15 కోట్ల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించారు. ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నానన్నారు.