మంత్రాలయం: పొదుపు మహిళలందరినీ అక్షరాస్యులను చేయాలి: పెద్ద కడబూరు వయోజన విద్యా జిల్లా అధికారి ప్రతాప్
పెద్ద కడబూరు:పొదుపు మహిళలందరినీ అక్షరాస్యులను చేయాలని వయోజన విద్యా జిల్లా అధికారి ప్రతాప్ సూచించారు. మంగళవారం పెద్ద కడబూరు మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో ఏపీఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలస్థాయి వాలెంటీర్ టీచర్లకు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యసన, అవగాహన కల్పించాలన్నారు. ఉల్లాస్ - అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయాలన్నారు.