మేడ్చల్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ ఘటనపై కేసు నమోదు
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న జరిగిన పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులు ఒకరి ప్రైవేటు భాగాలపై కాళ్లతో తన్ని గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాచారం పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.