కదిరి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లెలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో కదిరి నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు వరాలజల్లు కురిపించారు. కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే డిగ్రీ కళాశాలలు, షాదీ ఖానాలు, మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాల, నియోజవర్గంలోని చెరువులను నీటితో నింపడం తదితర వాటిని చేపడతామని సీఎం తెలియజేశారు.