తాడేపల్లిగూడెం: ఈ నెల 25న తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నామినేషన్, పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపు.
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ సభ్యుడిగా పోటీ చేస్తున్న తానూ ఈ నెల 25వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు నామినేషన్ వేస్తున్నానని అన్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, తాడేపల్లిగూడెం వైకాపా ఎమ్మల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. ఆయన తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కోరారు.