పత్తికొండ: డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికీ తీవ్ర గాయాలు చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
డోన్ రూలర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో ఆటో, బైక్ దెబ్బతిన్నాయి. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.