తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం సీతారాంపేట హైవేపై కరెంటు పోలును ఢీకొన్న ద్విచక్ర వాహనం యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే మండలం చల్లపాలెం గ్రామానికి చెందిన వంకాయలపాటి లక్ష్మీనారాయణ రెడ్డి 20 సంవత్సరాలు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న క్రమంలో అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఏర్పేడు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు