అనంతపురం నగరంలో శారద నగర్ వద్ద డిప్యూటీ తహసిల్దార్ భార్య, కుమారుడు అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Nov 27, 2025
అనంతపురం నగరంలోని శారద నగర్ లో శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం డిప్యూటీ తహసిల్దార్ రవి భార్య అమూల్య మూడున్నర సంవత్సరాల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నారి గొంతు కోసి హత్య చేయగా, డిప్యూటీ తహసిల్దార్ భార్య అమూల్య ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.