అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న పిల్లిగుండ్ల క్వార్టర్స్ లో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన ఎస్ మంజునాథ్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మదిగుబ్బ గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులు గత కొద్ది సంవత్సరాల నుంచి పిల్లిగుండ్ల క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయడం లేదంటూ మనస్థాపం చెంది ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.