తెలుగు దేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రమాణం చేసిన పీలేరు నియోజకవర్గంలోని మండలాల పార్టీల అధ్యక్షులు
టీడీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పీలేరు నియోజకవర్గంలోని 6మండలాల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులతో పాటు, క్లస్టర్,యూనిట్,విలేజ్, బూత్ కమిటీల సభ్యులు,ఐ టీడీపీ మండలాధ్యక్షులు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ నగిరిపల్లి గ్రామంలో మండల పార్టీల అధ్యక్షులు, ఐటీడీపీ అధ్యక్షులు, క్లస్టర్,యూనిట్ విలేజ్ బూత్ కమిటీ సభ్యులతో ఎమ్యెల్యే సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు. కలికిరి,వాయల్పాడు మండల పార్టీల నూతన అధ్యక్షులుగా గడి షాబుద్దీన్,దామోదర్ రెడ్డి లను నియమించి ఘనంగా సన్మానించారు.