ఉదయగిరి: ఉదయగిరిలో డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీసుకున్న ఓటీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయగిరిలో డాక్యుమెంట్ రైటర్లు సోమవారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయగిరి సబ్ రిజిస్టర్ రోషన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఓటీపీ విధానం వల్ల ఇటు రైటర్లు అటు కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.