సూళ్లూరుపేట పురపాలక సంఘం ట్రాక్టర్లు అంధకారంలోనే ప్రయాణం
- భయాందోళనలు చెందుతున్న స్థానికులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం వినియోగిస్తున్న ట్రాక్టర్ల పరిస్థితిపై గురువారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లకు సరైన సెల్ఫ్ స్టార్ట్ సదుపాయం లేకపోవడంతో పాటు, రాత్రి వేళల్లో లైట్లు పనిచేయకపోవడం వల్ల వాహనాలు అంధకారంలోనే నడుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రజలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యం ఎప్పటికైనా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గడిచిన కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమంటున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాక్టర్లను మరమ్మతులు చేయించి, అవసరమైన సదుపాయాలను కల్పించాలని పురపాలక