అనంతపురం నగరంలో బుక్కరాయసముద్రం సింగల్ విండో అధ్యక్షుడిపై హత్యాయత్నం
Anantapur Urban, Anantapur | Sep 30, 2025
అనంతపురం నగరంలోని పాతూరు వనవే వద్ద బుక్కరాయసముద్రం సింగల్ విండో అధ్యక్షుడు కేశన్నపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్యయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా అతని ఛాతిపై పొడిచినట్లుగా స్థానికులు తెలియజేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.