పేరూరు సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పేరూరు సమీపాన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పరమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొండపల్లి నుండి చిన్నంపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పేరూరు సమీపాన ప్రమాదం జరిగినది.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.