మేడ్చల్: ఘట్కేసర్ లో జరిగిన అందెశ్రీ సంతాప సభలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఘట్కేసర్ లో అందెశ్రీ సంతాప సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించేంతవరకు పీడిత ప్రజల కోసం, సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజానీకం కోసం తపనపడ్డ మహనీయుడు అందెశ్రీ అని అన్నారు. ఆయన పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ అని, చదువుకు దూరమైన గొప్ప మేదస్సు సంపాదించారని కొనియాడారు. అప్పటికప్పుడు పెదాల మీదనే పాట రూపొందించే వారిని అన్నారు.