అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. దీనికి సంబంధించి శుక్రవారం నాడు పరవాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో మల్కాపురంకు చెందిన సబ్బవరపు కృష్ణం నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారం ,45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.