లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.