నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను వేధిస్తుంది, మున్సిపల్ సిబ్బంది మురుగు కాలువలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్లపై పారుతూ దుర్గంధం వ్యాప్తిస్తుంది ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడగండ్ల గ్రామంలో డ్రైనేజీరు రోడ్డుపై పారుతుండటంతో దారిన పోయే ప్రజలు ముక్కు మూసుకొని రోడ్డు దాటే పరిస్థితి ఏర్పడింది అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు