అవకాశం ఉన్న ప్రతి ఇంటి మీద పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కనిపించాలని మెప్మా అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మెప్మా అధికారులతో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా పీఎం సూర్య ఘర్, స్ట్రీట్ ఫుడ్స్, తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించారు. ఇప్పటి వరకు ఎంత మంది పీఎం సూర్య ఘర్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మంది యూనిట్స్ ఏర్పాటు చేసుకున్నారన్నది ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో ప్రతి గృహ వినియోగదారునికి ఈ పథకంపై అవగాహన కల్పించాలన్నారు.