గిద్దలూరు: కంభం మండలంలోని కంభం చెరువుకు కొనసాగుతున్న వరద ఉధృతి, అలుగు వైపు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు విజ్ఞప్తి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన కంభం మండలంలోని కంభం చెరువుకు ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇంకా పదిరోజుల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అధికారులు ఆదివారం అంచనా వేస్తున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న అలుగు వద్దకు వెళ్లి ప్రజలు ప్రాణాపాయం తెచ్చుకోవద్దని అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత మొత్తంలో వరద నీరు రాలేదని ప్రస్తుతం అలుగు 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.