తలకొండపల్లి మండలంలోని దేవుని పడగల్ గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి 2 పాడి ఆవులు మృతి చెందాయి. శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన వర్షం కారణంగా విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడడంతో శనివారం ఉదయం దేవుని పడకల గ్రామ రైతుకు చెందిన రెండు పాడి ఆవులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం తరఫున తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.