మహిళ విద్యకు జ్యోతిరావు పూలే మార్గదర్శకుడు: DRO డి.పుష్పా మణి
Eluru, Eluru | Apr 11, 2024 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి,స్త్రీ విద్య కొరకు పాటుపడిన జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పామణి అన్నారు. గురువారం జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్ర పటానికి డిఆర్ఓ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా గానీ, సామాజికం గానీ ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు చదువు చాలా అవసరమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పారని ఆమె పేర్కొన్నారు.