పెద్దవడుగూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి గణపతి రాఘవేంద్ర అదృశ్యమయ్యాడు. శనివారం పాఠశాలకు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో పాఠశాల నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి రాలేదు. హాస్టల్ కూడా వెళ్లలేదు. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గణపతి ఆచూకీ కోసం గాలించారు. ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఎస్ఐ ఆంజనేయులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.