సోమందేపల్లిలో 16 మందికి రూ.12 వేల ఫైన్
సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నేషనల్ హైవేపై ఎస్ఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైవేపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్లు వాడని వాహనదారులకు ఫైన్ విధించారు. సుమారు 16 మందికి రూ.12,000 ఫైన్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.