తాడిపత్రి: ప్రతి కౌన్సిలర్ వార్డులో పర్యటించి సమస్యలు గుర్తించాలని తెలిపిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీ తంగా అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావే శాన్ని వైస్ చైర్పర్సన్ అరుణ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. 26 అజెండాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కౌన్సిలర్ వార్డుల్లో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు.