ప్రధానమంత్రి మోడీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నంద్యాల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.