ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డు పుట్టబజార్లో మున్సిపల్ అధికారులు జల సురక్ష నీటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య అన్నారు. సురక్షితమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అందులో భాగంగానే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.